ఇసుక కొరతపై సీఎం జగన్ కీల‌క నిర్ణయం.. ఆదేశాలు జారీ..

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇసుక కొరతపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నాడు ఈ విషయమై అధికారులతో సమీక్ష నిర్వహించి జగన్.. నవంబర్‌ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు జరపాలని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో ఇసుక కొరత తీసుకొనేవరకు అధికారులెవరూ సెలువులు తీసుకోవద్దన్నారు. గతంలో సరాసరి ఇసుక డిమాండ్‌ 80వేల టన్నులు ఉండేది. వరదలతో రీచ్‌లు మునిగిన కారణంగా డిమాండ్‌ను చేరుకోలేకపోయాం. గత వారం రోజులుగా పరిస్థితి మెరుగుపడింది.

రీచ్‌ల సంఖ్య సుమారు 60 నుంచి 90కి చేరింది. 137 నుంచి 180 వరకూ స్టాక్‌ పాయింట్లు పెంచాలి.నియోజకవర్గాల వారీగా రేటు కార్డును ప్రకటించాలి. ఎల్లుండిలోగా రేటు కార్డును నిర్ణయించాలి. ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే రెండేళ్ల వరకు జైలుశిక్ష. సరిహద్దుల్లోని అన్ని రూట్లలో చెక్‌పోస్టులు పెట్టాలి. 10 రోజుల్లోగా చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల‌ని అధికారులను జగన్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version