తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు గట్టిగా రాష్ట్ర ప్రభుత్వ సమస్యలను ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటివరకు మాట్లాడకపోయినా సరే ఇప్పటి నుంచి ఎంపీలు పార్లమెంట్ లో ఎంత వరకు పోరాటం చేస్తున్నారు ఏంటి అనేది ప్రజలు గమనించే పరిస్థితి ఉంది. కానీ ఈ విషయంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు అధికార పార్టీ ఎంపీలు.
ఒకపక్క తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వంపై అలాగే కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్ వేదికగా విమర్శలు చేస్తున్నారు. ఎక్కడా కూడా వైసీపీ ఎంపీల నుంచి స్పందన రావడం లేదు. దీని కారణంగా సమస్యలు పెరుగుతున్నాయి. తిరుపతి పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ కొన్ని అంశాలను ఎక్కువగా హైలెట్ చేస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోయినా సరే ముఖ్యమంత్రి జగన్ పోరాటం చేయడం లేదని ఎంపీలతో కూడా పోరాటం చేయించడం లేదు అంటూ కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు నియోజకవర్గాల్లో బలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో కూడా ఇవే అంశాలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. కాబట్టి అధికార పార్టీ నేతలు ఈ అంశాలను చాలా సీరియస్ గా తీసుకోవాలి. పార్లమెంట్ సమావేశాల్లో ఎంతవరకు మాట్లాడుతారు అనేది కూడా ప్రజలు కచ్చితంగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని అంశాలలో జగన్ కూడా ఎంపీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కొంత మంది కోరుతున్నారు.