ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకొచ్చిన ఎన్నో నిర్ణయాలు ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తీసుకుంటున్న పలు నిర్ణయాలు చూసి పక్క రాష్ట్రాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్ధిక లోటు ఉన్నా సరే సంక్షేమ కార్యక్రమాలను జగన్ ఎంతో విజయవంతంగా అమలు చేస్తూ వస్తున్నారు. అలాగే పలు చట్టాలను తీసుకొస్తూ దేశానికే ఆయన ఆదర్శంగా నిలుస్తు వస్తున్నారు.
మహిళల రక్షణ కోసం ఆయన తీసుకొచ్చిన దిశా చట్టంపై పలువురు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ఆ పథకం వలన మహిళల భద్రత అనేది పెరుగుతుంది అంటున్నారు పలువురు. ఇప్పటికే ఈ చట్టం కోసం ఆయన పోలీస్ స్టేషన్లను కూడా ప్రారంభించారు. రాజమండ్రి, విజయనగరంలో పోలీస్ స్టేషన్ ని ఆయన ప్రారంభించారు. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం సైతం మహిళలపై అత్యాచారాలను నిరోధించడానికి గాను దిశా చట్టాన్ని తీసుకురావాలని భావిస్తుంది.
మహారాష్ట్రలోనూ దిశ యాక్ట్ అమల్లోకి తెచ్చేందుకు, చట్టంపై అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర సర్కారు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. మార్చి 30వ తేదీలోపు నివేదిక అందజేయాలని ఈ కమిటీని ఆదేశించినట్టు ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ మీడియాకు వివరించారు. ఇక ఈ చట్టంపై ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు వివరాలు కూడా అడిగి తెలుసుకున్నాయి.