జల వివాదంపై నేడు సీఎం కేసీఆర్‌ కీలక సమీక్ష

-

ఆంధ్ర ప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం మళ్లీ ముదురుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిన్న ఏపీ వ్యవహారంపై కేంద్రానికి తెలంగాణ సర్కార్‌ లేఖ రాయగా.. తాజాగా ప్రగతి భవన్ లో ఈరోజు ఇరిగేషన్ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహించనున్నారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

ఈ సమావేశానికి తెలంగాణ మంత్రులు కూడా హాజరు అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఈ సమావేశంలో కేంద్రం విడుదల చేసిన గెజిట్ లోని అంశాలపై చర్చ నిర్వహించనున్నారు. అలాగే రైతుల రుణమాఫీ పై కూడా చర్చించే అవకాశాలున్నాయి.

కాగా.. ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు నిన్న తెలంగాణ సర్కార్‌ లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపులకు మించి నీటిని వాడుకుంటుందని లేఖలో పేర్కొంది. తెలంగాణాలో జల విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి కొరత ఏర్పడుతోందన్న టీ సర్కార్… అధిక నీటిని వాడుతున్న ఏపీని నిలువరించాలంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు తెలంగాణ ఫిర్యాదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news