ధర్నా చౌక్ నుంచే సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమైందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ ఎన్నికలలో టీఆర్ఎస్ ఓటమి పాలు అవడం తోనే ఫామ్ హౌస్ విడిచి బయటకు వచ్చాడని విమర్శించాడు. ఇక తెలంగాణ లో తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి కాలం చెల్లిందని ఈటల అన్నాడు. అసెంబ్లీలో తన ముఖం చూడకూడదనుకుంటే కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నానని పచ్చి అబద్దాలు చెబుతున్నాడని విమర్శించాడు.
అలాగే కేసీఆర్ రైతు వ్యతిరేకి అని ఆరోపించారు. కేంద్రం కేసీఆర్ లా గా వ్యక్తి గత దాడులు చేయదని తెలిపారు. అలాగే రైతుబంధు ఇచ్చి రైతులు కు వచ్చే అనేక రకాల సబ్సిడీలను ఆపేస్తున్నారని మండి పడ్డారు. వరి వేస్తే ఉరే అని మాట్లాడటం ముర్ఖత్వం మని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని కేసీఆర్ చెప్పలేదా.. అని ప్రశ్నించారు. అలాగే ధర్న లో సీఎం కేసీఆర్ భాష అత్యంత జుగుస్సాకరంగా ఉందని విమర్శించారు. రాష్ట్రం లో జీతాలకే పైసలు లేవు ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.