తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ లో తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పే నిర్ణయం తీసుకున్న కేసీఆర్..!!

-

రీసెంట్ గా కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక విషయాల గురించి కెసిఆర్ చర్చించినట్లు సమాచారం. త్వరలో మార్చి నెల నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆ విషయంపై ఎక్కువ చర్చ ఈ క్యాబినెట్ సమావేశంలో జరిగినట్లు టాక్. త్వరలో తెలంగాణ రాష్ట్రం లో జరగబోయే బడ్జెట్ సమావేశాలలో సీఎం కేసీఆర్ సిఏఏ అమలు పై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారట.  సిఏఏ ను తెలంగాణలో అమలు చేయకూడదు అని ఫుల్ క్లారిటీ తో డిసైడ్ అయ్యారట. Image result for kcr

ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన తీర్మానాన్ని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ఆమోదింప చేయడానికి కెసిఆర్ సన్నాహాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు కెసిఆర్ ఉద్యోగాల జాతర అన్నట్టు భారీ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వాలని ఈ క్యాబినెట్ సమావేశంలో డిసైడ్ అయినట్లు సమాచారం. ముఖ్యంగా పురపాలక శాఖ లో దాదాపు రెండు వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని కెసిఆర్ ప్రభుత్వ అధికారులకు సూచించారట.

 

దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు కెసిఆర్ తీసుకున్న నిర్ణయం అమలు అయితే నిజంగానే శుభవార్త అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ ఎక్కువగా ఆంధ్రలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంతో తెలంగాణలో సీఎం కేసీఆర్ పై ఆ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఆంధ్రాలో జరుగుతున్న పరిపాలన ను ఉద్దేశించి విమర్శించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వం తరఫున ఉద్యోగాల నోటిఫికేషన్ కెసిఆర్ విడుదల చేయాలని భావిస్తున్నారట. 

Read more RELATED
Recommended to you

Latest news