రైతుబంధు తరహాలోనే దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో ఇరవై ఒక్క వేల దళిత కుటుంబాలు ఉన్నట్లు సమగ్ర సర్వేలో తేలిందని చెప్పిన సీఎం కేసీఆర్…. హుజురాబాద్ లో వచ్చే నెల లేదా రెండు నెలల్లోనే అందరికీ దళిత బంధువు డబ్బులు ఇస్తామని ప్రకటించారు.
పేదలకు రూపాయి ఇవ్వను పార్టీలు కూడా ఇవాళ దళిత బంధు పథకం పై కిరికిరి పెడుతున్నాయని మండిపడ్డారు. ఏ పథకం ప్రారంభించిన విపక్షాలకు అపోహలు మరియు హనుమాన్ ఆలయం అని నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న దళితులకు కూడా దళిత బంధు ఇస్తామని స్పష్టం చేశారు. దళిత బంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని సీఎం చెప్పారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఘనంగా పెరిగిందని.. కరీంనగర్ లో రైతు భీమా ప్రారంభించు కున్నామని వెల్లడించారు కెసిఆర్. నా జీవితం లో కొత్త చరిత్ర సృష్టించే పథకం దళిత బందు అని పేర్కొన్నార ఆయన ఇదో మహా ఉద్యమమన్నారు.