2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలానికి తెలంగాణ బడ్జెట్ ను 1,82,017 కోట్ల రూపాయలుగా సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,31,629 కోట్లు కాగా… మూలధన వ్యయం రూ.32,815 కోట్లు. రెవెన్యూ మిగిలు రూ. 6,564 కోట్లు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు రూ.1450 కోట్లు, నిరుద్యోగ భృతికి రూ.1810 కోట్లు, ఎస్సీల ప్రగతికి రూ.16,581 కోట్లు, ఎస్టీల ప్రగతికి రూ.9,827 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం రూ.2004 కోట్లు, రైతు రుణ మాఫీకి రూ.6000 కోట్లు, బియ్యం రాయితీకి రూ.2774 కోట్లు, రైతు బీమాకు రూ.650 కోట్లు, రైతు బంధు సాయం కోసం 12 వేల కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్ కు 1000 కోట్లు, వ్యవసాయశాఖకు 20,107 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 5536 కోట్లు, నీటిపారుదలశాఖకు 22,500 కోట్లు, ఈఎన్టీ, దంత పరీక్షల కోసం 5536 కోట్లు, రెండు ఫైనాస్ కమిషన్ల నుంచి పంచాయతీలకు 3256 కోట్లను కేటాయించారు.