మాజీ మంత్రికి కెసిఆర్ దిమ్మ తిరిగే షాక్…!

-

అధిష్టానాన్ని ఎదిరించి తన అభ్యర్ధులను పోటీలో నిలబెట్టి గెలిపించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకి తెరాస అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయన నిలబెట్టిన అభ్యర్ధులను పార్టీలోకి తీసుకోవడానికి అధిష్టానం అంగీకరించలేదు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన తెరాస అధిష్టానాన్ని ధిక్కరించి, తన వర్గాన్ని బరిలోకి దింపి గెలిపించారు. వాళ్ళ తరుపున ప్రచారం చేసారు.

దీనిపై అధిష్టానం ఎన్ని సూచనలు చేసినా సరే ఆయన వెనక్కు తగ్గలేదు. కొల్లాపూర్ లో తన అభ్యర్ధులను నిలబెట్టి గెలిపించారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్‌ అభ్యర్థులు టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తారని ఆయన చెప్పినా సరే అధిష్టానం అంగీకరించలేదు. కొల్లాపూర్‌లో జూపల్లి వర్గాన్ని టీఆర్ఎస్‌లో చేరేందుకు అవకాశం లేదని వాళ్ళను ఏ మాత్రం పార్టీలోకి చేర్చుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది.

మున్సిపల్ ఎన్నికల్లో కొల్లాపూర్‌లో 20 స్థానాలకు గాను అధికార టీఆర్ఎస్ 9స్థానాలు గెలవగా, జూపల్లి వర్గం 11 వర్గం గెలిచింది. మున్సిపల్ పీఠం కైవసం కోసం కావాల్సినవి 12స్థానాలు కాగా జూపల్లి వర్గం 11మంది గెలిచినా ఎక్స్అఫీషియో ఓట్లతో టీఆర్ఎస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే తమ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్ధులు చేజారకుండా ఉండటానికి తమ 9 మందిని క్యాంప్ కి తరలించింది.

Read more RELATED
Recommended to you

Latest news