ఎమ్మెల్యేలకు కేసీఆర్ గుడ్ న్యూస్…?

-

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారా లేదా అనే దానిపై సందిగ్దత నెలకొంది. ఆయన ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి అని టిఆర్ఎస్ పార్టీ వర్గాలంటున్నాయి. సీఎం కేసీఆర్ మాత్రం ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించటం లేదు. అయితే త్వరలోనే సీఎం ప్రచారం చేయడానికి రెడీ అయ్యారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సోమవారం నుంచి ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవకాశాలు ఉన్నాయి.

ముందు హైదరాబాద్ లో ఒక రోడ్ షో కూడా సీఎం కేసీఆర్ నిర్వహిస్తారని ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో ఒక సభను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తర్వాత నల్గొండ జిల్లాలో కూడా సీఎం కేసీఆర్ సభలు ఏర్పాటు చేసి ప్రచారం చేయనున్నారు అని మీడియా వర్గాలకు సమాచారం అందింది. అంతేకాకుండా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి సీఎం కేసీఆర్ కొన్ని నియోజకవర్గాల్లో తిరిగి ఎమ్మెల్యేలతో సమావేశం కూడా కానున్నారని సమాచారం.

2018 ఎన్నికల తర్వాత జిల్లాలకు సీఎం కేసీఆర్ పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకం కాబట్టి ఆయా జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఉప ఎన్నికల్లో కూడా సీఎం కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉండటంతో పార్టీ ఓటమి పాలైంది అనే ఆవేదన కొంతమంది ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతుంది. అందుకే ఇప్పుడు సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార బాధ్యతలను మంత్రులు చూస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news