హుజూరాబాద్ ఉప ఎన్నికపై కెసిఆర్ షాకింగ్ కామెంట్స్ !

-

కాంగ్రెస్ పార్టీ మాజీ యువనేత పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో… కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా సిఎం కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

నన్ను తిట్టిన తిట్లు ప్రపంచంలో ఎవరిని తిట్టి ఉండరని.. ఎవరు ఏం అన్న నా ప్రస్థానం కొనసాగిస్థానని తెలిపారు. నోరు ఇచ్చారని కుక్కులు మోరిగినట్టు మొరిగితే ఎట్లా ? అని విపక్షాలపై మండిపడ్డారు. గతంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉందని..గొర్రెలు పెంపకంలో తెలంగాణ ఇప్పడు నెంబర్ వన్ అని చెప్పారని తెలిపారు.

హుజురాబాద్ ను దళిత బంధు స్కీమ్ కోసం పైలెట్ గా తీసుకున్నామని.. స్కీమ్ పెడితే రాజకీయంగా లాభం కోరుకోవడంలో తప్పు ఏముంది ? అని మండిపడ్డారు. టిఆర్ఎస్ రాజకీయ పార్టీయే కదా ? కరీంనగర్ తనకు సెంటిమెంట్ జిల్లా అని పేర్కొన్నారు. తనకు స్వార్థం ఉంటే దళిత బంధు గజ్వేల్ లో పెట్టెవాన్ని కదా అని తెలిపారు. అన్ని రకాల సంపద ఉన్న తెలంగాణ సమైక్య పాలనలో నష్ట పోయిందని గుర్తు చేశారు సిఎం కెసిఆర్. రైతు బంధు లక్ష్యం నెరవేరిందని.. తలసరి విద్యుత్ వినియోగం లో ఇప్పుడు తెలంగాణ నెంబర్ వన్ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news