కాంగ్రెస్‌లో పార్టీలో కనిపిస్తున్న ఊపుతో రేవంత్ రెడ్డి revanth reddy తన మార్కును చూపించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటి వరకు కనీసం కాంగ్రెస్ నుంచి వీడి పోయిన వారే తప్ప కాంగ్రెస్ లోకి వచ్చిన వారెవరూ లేకపోవడంతో ఆ పార్టీని పట్టించుకునే వారే కరువయ్యారు. ఇక లాభం లేదని రేవంత్ ను ప్రెసిడెంట్ గా చేయడంతో జోష్ పెరిగింది. దీంతో పాత నేతలందరూ మళ్లీ కాంగ్రస్ లోకి వచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే ఇక్కడే రేవంత్ ఓ ఫిట్టింగ్ పెడుతున్నారు.
ఎందుకంటే రీసెంట్ గా ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో అక్కడి జిల్లాలోని స్థానిక నేతలందరూ చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఈ విషయం కాస్త రేవంత్ దాకా వెళ్లింది. కార్యకర్తలు వ్యతిరేకిస్తే పార్టీకి చాలా తీవ్ర నష్టం జరుగుతుందని రేవంత్ భావించి ఇకపై చేరేవారి విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా చేరేవారిని పూర్తిగా పరిశీలించేందుకు ఓ కమిటీని కూడా వేశారు.
పీసీసీ నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ పార్టీలోకి రావాలనుకుంటున్న వారిపై బయోగ్రఫీని పరిశీలించి వారికి ఆ నియోజకవర్గంలో ఎలాంటి వ్యతిరేకత లేకపోతేనే పార్టీలోకి ఆహ్వానిస్తారంట. అంటే ఆ నేతకు స్థానికంగా కాంగ్రెస్ కార్యకర్తల మద్దతు ఉంటేనే రానిస్తామని చెబుతున్నారు. అయితే ఇది పార్టీలోకి రావాలనుకుంటున్న వారికి ఇబ్బందిని తెస్తుందని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి రేవంత్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో.