బీఎస్పీ-టీజేఎస్‌తో చిక్కులు..మునుగోడులో ముప్పు ఎవరికి?

-

మునుగోడులో గెలుపు కోసం ప్రధాన పార్టీలు పడని పాట్లు లేవు. ఒక్క ఓటు కూడా చేజారుకూడదని చెప్పి..ఎప్పటికప్పుడు కొత్త స్కెచ్‌లతో టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు పనిచేస్తున్నాయి. ఓటర్లకు తాయిలాలు ఇవ్వడం, ఇతర పార్టీ నేతలని డబ్బులు పెట్టి మరీ కొనేయడం..అబ్బో ఒకటి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఓటర్లకు విందు, వినోదాలు ఏ మాత్రం తగ్గడం లేదు. మొత్తానికి మునుగోడులో ఓట్లు పండుగ నడుస్తోంది.

అయితే గెలవడానికి అన్నీ రకాల ప్రయత్నాలు మూడు పార్టీలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో మునుగోడు బరిలో ఉండే ఇండిపెండెంట్ అభ్యర్ధుల చేత నామినేషన్లు సంహరించుకునేలా చేస్తున్నారు. ఎందుకంటే కొందరు ఇండిపెండెంట్ అభ్యర్ధులకు టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారుని పోలిన రోడ్డు రోలర్‌, ట్రాక్టర్‌, చపాతీ మేకర్‌, ఆటో, కేక్‌, క్యాప్‌, ఇస్త్రీపెట్టె, టీవీ వంటి గుర్తులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇలా గుర్తుల వల్ల టీఆర్ఎస్ నష్టం కూడా జరిగింది. అందుకే ఆ గుర్తులని రద్దు చేయాలని ఈసీని కోరారు..అలాగే కోర్టుకు కూడా వెళుతున్నారు. అటు కమలం గుర్తుని పోలిన డైమండ్, ఫైనాఫిల్ లాంటి గుర్తులని రద్దు చేయాలని బీజేపీ కోరుతుంది. ఇలా గుర్తులతో పాటు అభ్యర్ధుల ఇంటి పేర్లతో కొందరు బరిలో ఉంటున్నారు. కోమటిరెడ్డి సాయితేజారెడ్డి అనే వ్యక్తి నామినేషన్ వేయడంతో..అతన్ని బరిలో నుంచి తప్పించడానికి బీజేపీ కష్టపడుతుంది. మొత్తానికైతే ఇలా ఇండిపెండెంట్‌లతో ప్రధాన పార్టీలకు రిస్క్ ఉండేలా ఉంది.

అలాగే బి‌ఎస్‌పి, తెలంగాణ జన సమితి పార్టీల అభ్యర్ధులతో కూడా రిస్క్ కనిపిస్తోంది. బి‌ఎస్‌పి పార్టీ దళిత ఓట్లని చీల్చే ఛాన్స్ ఉంది. మునుగోడులో 35 వేలకు పైనే దళిత ఓట్లు ఉన్నాయి. అటు టి‌జే‌ఎస్ నుంచి బీసీ అభ్యర్ధి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల ఓట్లు చీలిస్తే..ఎవరికి డ్యామేజ్ అవుతుందో అర్ధం కాకుండా ఉంది. మొత్తానికి టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీలు ఈ ఓట్ల చీలికపై టెన్షన్ పడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news