కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక భేటీ… 5 రాష్ట్రాల ఎన్నికలు, పార్టీ నాయకత్వ మార్పుపై చర్చ

-

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఈ రోజు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అత్యంత ఘోరంగా ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో 403 స్థానాలకు పోటీ చేస్తే కేవలం రెండు స్థానాలనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక పంజాబ్ లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థితో పాటు, పీసీసీ ప్రెసిడెంట్ సిద్దూ కూడా ఘోరంగా ఓడిపోయారు. ఇక గెలిచే అవకాశం ఉండీ కూడా సొంత తప్పిదాలతో ఉత్తరాఖండ్ ను కోల్పోయింది కాంగ్రెస్. ఇదిలా ఉంటే ఇటీవల కాంగ్రెస్ ఓటమిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు జీ 23గా పిలువబడుతున్న వారు గులామ్ నబీ ఆజాద్ అధ్యక్షతన సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని సీనియర్లు డిమాండ్ చేశారు.

తాజాగా ఈ రోజు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అయింది. సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈసమావేశానికి రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ, అంబికా సోని, కపిల్ సిబల్, ప్రియాంకా గాంధీ, ముకుల్ వాస్నిక్, గులామ్ నబీ ఆజాద్ వంటి నేతలు హాజరయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీ తాత్కాలికంగా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. అయితే పూర్తిస్థాయి అధ్యక్షులను నియమించాలని సీనియర్లు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news