పంజాబ్ రాష్ట్ర ముఖ్య మంత్రిని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. పంజాబ్ ముఖ్య మంత్రి గా చరణ్ జిత్ చన్నీ ని నియామకం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు అధి కారికంగా ప్రకటన చేశారు పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జీ హరీష్ రావత్.
పంజాబ్ ముఖ్యమంత్రి గా చరణ్ జిత్ చన్నీ పేరును… కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతి పాదించారు. దీంతో చరణ్ జిత్ చన్నీ నే.. పంజాబ్ ముఖ్యమంత్రి గా చేస్తున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. మధ్యాహ్నం వరకు సుఖ్ జిందర్ రంధావా ను ముఖ్యమంత్ర చేస్తారని అందరూ అనుకున్నప్పటికీ… చివరకు చరణ్ జిత్ చన్నీ కే మొగ్గు చూపింది కాంగ్రెస్ అధిష్టానం. కాగా… నిన్న పంజాబ్ ముఖ్య మంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పంజాబ్ గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించారు అమరీందర్ సింగ్. గవర్నర్ కు సీఎం తో పాటు మంత్రులు కూడా రాజీనామా లేఖలు ఇచ్చారు.