క‌లిసిన కాంగ్రెస్ నేత‌లు.. ఇలాగే ఉండాలంటున్న కార్య‌క‌ర్త‌లు

తెలంగాణ రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. ఎందుకంటే ప్ర‌తి పార్టీలో చాలా విచిత్ర ప‌రిస్థితులు ఉన్నాయి. అన్ని పార్టీల్లోనూ గ్రూపు రాజ‌కీయాలు అలాగే కొన‌సాగుతున్నాయి. ఇక కాంగ్రెస్‌లో అయితే అది కాస్త ఎక్కువ‌గానే ఉందని చెప్పాలి. ఇప్ప‌టికే టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి కోసం నేనంటే నేనంటూ పోటీ ప‌డుతూ వ్య‌క్తిగ‌తంగా వైరం పెంచుకున్నారు నేత‌లు.

ఇక ఇప్పుడు మాత్రం ఓ అద్భుత‌మైన ఘ‌ట‌న జ‌రిగింది. కాంగ్రెస్ అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం కాంగ్రెస్ నేత‌లు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంక‌ట్‌రెడ్డి క‌లిసి గవర్నర్ తమిళ సైను కలిశారు.

ప్ర‌స్తుతం తెలంగాణలో కొవిడ్ క‌స్ట‌కాలంలో కేసీఆర్ సర్కారు ఎంతలా ఫెయిల్ అయిందన్న విషయాన్ని గ‌వ‌ర్న‌ర్‌కు వారు వివరించారు. అయితే రేవంత్ రెడ్డి, వెంక‌ట్‌రెడ్డి ఇలా ఒక విష‌యంపై క‌ల‌వ‌డం చాలా అరుద‌నే చెప్పాలి. పదవి నుంచి తప్పుకుంటున్న ఉత్త‌మ్ తో పాటు అదే పదవి కోసం పాకులాడుతున్న రేవంత్‌, వెంక‌ట్ రెడ్డి క‌ల‌వ‌డంతో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు సంబుర‌ప‌డుతున్నారు. అన్ని విష‌యాల్లో ఇలాగే క‌లిస్తే బాగుంటుంద‌ని, పార్టీకి ప‌ట్టు ఉంటుంద‌ని భావిస్తున్నారు.