కరోనా : ఇకపై టీకా ఉచితం.. ప్రధాని మోదీ

-

వ్యాక్సినేషన్ విషయంలో ఉన్న ఎన్నో సందేహాలను ప్రధాని మోదీ తీర్చేసారు. రాష్ట్రాలకు ఒక రేటు, కేంద్రానికి మరో రేటు, ప్రైవేటు ఆస్పత్రులకి వేరే రేటు అంటూ గందరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఇకపై దేశ ప్రజలందరికీ ఉచిత టీకా ఇస్తామంటూ హామీ ఇచ్చారు. రాష్ట్రాలు వ్యాక్సిన్లపై ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

దేశంలోని 18ఏళ్ళు పైబడిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తామన్నారు. వ్యాక్సిన్లన్నీ కేంద్రమే కొనుగోలు చేస్తుందని, ప్రైవేటు ఆస్పత్రులకు 25శాతం వ్యాక్సిన్లు అందిస్తామని, 150రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయడానికి లేదని ఆదేశాలు మంజూరు చేసారు. ఇదే కాదు రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉచిత రేషన్ అందిస్తామంతూ హామీ ఇచ్చారు. ఈ నవంబరు నెల వరకు రేషన్ ఉచితంగా ఇస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news