కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కారెక్కనున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ ఖతం కానుందా?

283

ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె మాత్రమే కాదు.. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కూడా కారు ఎక్కనున్నట్లు వార్తలు వచ్చాయి.

సీతక్క.. ములుగు ఎమ్మెల్యే. ఆమెకు అక్కడ ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే.. రాష్ట్రమంతా టీఆర్ఎస్ గాలి వీచినా.. ములుగులో ఆమె కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె అసలు పేరు ధనసరి అనసూయ. కాకపోతే ఆమెను అందరూ సీతక్క అని పిలుస్తారు.

ఇప్పటికే సీఎల్పీ… టీఆర్ఎస్ లో విలీనం అయింది తెలుసు కదా. ఇక కాంగ్రెస్ కు మిగిలిందే ఆరుగురు సభ్యులు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతూ… సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని స్పీకర్ ను కోరారు. దీంతో సీఎల్పీ… టీఆర్ఎస్ లో విలీనం అయిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది.

తాజాగా… ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె మాత్రమే కాదు.. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కూడా కారు ఎక్కనున్నట్లు వార్తలు వచ్చాయి.

మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూడటంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఆ వార్తలపై సీతక్క క్లారిటీ ఇచ్చారు.

తాను టీఆర్ఎస్ లో చేరడం లేదని సీతక్క స్పష్టం చేశారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె తెలిపారు. ప్రస్తుతం పార్టీ మారే ఆలోచనే తనకు లేదని ఆమె స్పష్టం చేసినా… ఆమె కొన్ని రోజుల్లో ఖచ్చితంగా గులాబీ కండువా కప్పుకోబోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పొదెం వీరయ్య కూడా త్వరలోనే కారెక్కుతారట.