మొదటి నుంచి వైఎస్సార్సీపీలో ఉండి.. పార్టీని ఆర్థికంగా, రాజకీయంగా ఆదుకున్నారు పెద్దిరెడ్డి. ఆయన సీనియర్ ఎమ్మెల్యే కూడా. అందుకే.. రోజా కంటే పెద్దిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికే జగన్ మొగ్గు చూపారట.
ఇప్పుడు కాదు ఏపీ ఎన్నికల ముందు నుంచే వైఎస్సార్సీపీ గెలిస్తే రోజాకు మాత్రం మంత్రి పదవి ఖాయం అని వార్తలు వచ్చాయి. దీంతో రోజా కూడా తను గెలిస్తే మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అనుకున్నట్టుగానే ఫైర్ బ్రాండ్ రోజాకు నిజంగా మంత్రి పదవి దక్కబోతోందా? అసలు సీఎం జగన్.. రోజాకు ఏం పదవి ఇవ్వబోతున్నారు.. అనేది సర్వత్రా ఆసక్తి నెలకొనగా.. తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తోంది.
సీఎం జగన్ ఆఫర్ ను రోజా తిరస్కరించారట. రోజాకు ముందుగా స్పీకర్ పదవి ఇద్దామనుకున్నారట. చంద్రబాబు హయాంలో రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు కదా. సభలో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో చంద్రబాబుకు దిమ్మతిరిగేలా రోజాను స్పీకర్ చేసి.. చంద్రబాబు ఆమెను అధ్యక్షా అని చేయాలని జగన్ భావించారట. కానీ… రోజా మాత్రం తనకు స్పీకర్ పదవి వద్దని చెప్పారట.
మంత్రిగా అవకాశం ఇవ్వాలని ఆమె జగన్ ను అభ్యర్థించారట. దీంతో తాను నిర్ణయం తీసుకుంటానని జగన్ చెప్పారట. అయితే.. చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేబినేట్ లో బెర్త్ ఖాయం కావడంతో అదే చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రోజాకు మంత్రి పదవి ఇవ్వడానికి కష్టమేనని తెలుస్తోంది. ఒక జిల్లా నుంచి ఇద్దరికి ప్రాతినిథ్యం కల్పిస్తే మిగితా జిల్లాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మొదటి నుంచి వైఎస్సార్సీపీలో ఉండి.. పార్టీని ఆర్థికంగా, రాజకీయంగా ఆదుకున్నారు పెద్దిరెడ్డి. ఆయన సీనియర్ ఎమ్మెల్యే కూడా. అందుకే.. రోజా కంటే పెద్దిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికే జగన్ మొగ్గు చూపారట.
అయితే.. రోజాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా.. కీలక పదవి ఇవ్వడానికి జగన్ సిద్ధంగా ఉన్నారట. మంత్రి వర్గ విస్తరణ అనంతరం ఆమెకు వేరే పదవిని కట్టబెట్టాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.