డీసీసీ అధ్యక్షుని రేసులో అరడజన్ మంది.. అవకాశం ఎవరికో..?

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. చిన్న పోస్టులకు కూడా పుల్ గిరాకి పెరిగింది.. దీంతో పార్టీ, ప్రభుత్వ పోస్టులను ఇప్పించుకునేందుకు నేతలు క్యూ కడుతున్నారు.. ఈ క్రమంలో ఆ జిల్లా డీసీసీ పదవికి అరడజన్ మంది పోటీలో ఉన్నారట.. ఎవరిని నియమించాలో తెలీక అధిష్టానం కసరత్తు మీద కసరత్తు చేస్తోందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.. ఇంతకీ ఏదా జిల్లాలో చూద్దాం..

పాలమూరు డీసీసీ అధ్యక్షుని కోసం తీవ్రమైన పోటీ నెలకొంది.. అక్కడ ఉండే ఎమ్మెల్యేలందరూ సీనియర్లు కావడంతో.. తమ అనుచరులకు డీసీసీ అధ్యక్షుని పదవి ఇప్పించుకునేందుకు అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట.. ప్రస్తుతం అధ్యక్షునిగా ఉన్న మధుసూధన్ రెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యేగా గెలిచారు. డీసీసీ అధ్యక్షునిగా ఆయన పదవి కాలం రెండేళ్లు పూర్తయింది.. ఈ క్రమంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తుంది.. దీంతో తమ అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారట..

ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. వాటిల్లో 12 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులు గెలిచారు.. దీంతో డీసీసీ పదవిదక్కించుకునేందుకు సీఎం రెవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.. జిల్లాలో పార్టని బలోపేతం చెయ్యడంతో పాటు.. క్యాడర్ ను సమన్వయ పరిచి.. ఏకతాటిపైకి తీసుకొచ్చే సమర్దవంతమైన నాయకుడి కోసం అధిష్టానం అన్వేషిస్తుంటే.. నేతలు మాత్రం పోటాపోటీగా లాబీయింగులు చేస్తున్నారు..

అధిష్టానం మాత్రం జిల్లాలోని ఎమ్మెల్యేలతో చర్చించి.. ఐదేళ్లు పార్టీని నడపగలిగే, ఆర్దిక, సామాజిక సమీకరణాల సపోర్ట్ పుష్కలంగా ఉండే నేతని ఎంపిక చెయ్యాలని చూస్తోందట.. జడ్చర్ల నియోజకవర్గానికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనీల్ రెడ్డి కోరుతుండగా.. ఎఐసీసీ నాయకుడు సంపత్ కుమార్ తన తమ్ముడు వినోద్ కు ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారట.. వారితో పాటు.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజికవర్గాలకు చెందిన ప్రముఖులు సైతం తాము కూడా రేసులో ఉన్నామని చెబుతుండటంతో.. డీసీసీ పదవి ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా మారిందట.. ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి వరిస్తుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news