పంజాబ్ పీసీసీ పదవికి సిద్దూ రాజీనామా..

-

కాంగ్రెస్ లో 5 రాష్ట్రాల ఎన్నిలకు తీవ్ర ప్రకంపను కలిగిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఓటమికి బాధ్యత వహిస్తూ ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ ఈ ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లను రాజీనామా చేయాల్సిందిగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశించారు. 

తాాజాగా ఈరోజు పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ నవజ్యోత్ సిద్దూ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. పంజాబ్ లో అధికారంలో ఉండీ కూడా అవమానకర రీతిలో ఓడిపోయింది. మొత్తం 117 స్థానాల్లో కేవలం 18 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్ జీత్ సింగ్ చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. ఇక పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్దూ కూడా ఓడిపోయాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో ప్రక్షాళన పనులు ప్రారంభించింది.

Read more RELATED
Recommended to you

Latest news