ఏఐసీసీ తెలంగాణా ఇంచార్జి మానికం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేసారు. దుబ్బాక లో ఎన్నికల ప్రచారాన్ని పకడ్బందీగా చేపట్టాలని ఆయన సూచించారు. నియోజక వర్గంలో 146 గ్రామాలున్నాయని అన్నారు. ప్రతి రెండు గ్రామాలకు ఒక ముఖ్య నాయకున్ని ఇంచార్జి గా నియమించాలని పేర్కొన్నారు. ఏడు మండలాలకు ఒక కీలక నేతకు ఇంచార్జి గా బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు. నేతలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రెండు రోజుల్లో అభ్యర్ధిని ప్రకటిస్తామని, ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గాంధీభవన్ లో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహా హాజరయ్యారు.