పార్లమెంట్ లో కరోనా మోత… భారీగా ఎంపీలకు కరోనా… !

-

ఒకపక్క కరోనా తీవ్రత ఉన్న సరే పార్లమెంట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుని నిర్వహిస్తోంది. ఎంపీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా సభలో ఉన్న 700 మంది ఎంపీలు కూడా ఇప్పటివరకు కరోనా పరీక్షలు నిర్వహించారు.ఇక ఎంపీల విషయంలో కూడా చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా పార్లమెంట్ లో భారీగా కరోనా కేసులు బయటపడ్డాయి.

వైసీపీ ఎంపీలు ఇద్దరికీ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా అరకు ఎంపీ కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బీజేపీకి చెందిన మొత్తం 12 మంది ఎంపీలు అదేవిధంగా శివసేన కు చెందిన ఒక ఎంపీ ,డీఎంకేకు చెందిన మరో ఎంపి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో ఎంపీలు అందరినీ హోమ్ ఐసోలేషన్ కావాలి అని పార్లమెంట్ సచివాలయం కాసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎంపీలందరికీ కూడా ఇప్పటికే కరోనా కిట్స్ ని అందిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news