టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుని అరెస్టుపై హైకోర్ట్ స్టే ఇచ్చింది. ఇటీవలే అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిపై అభ్యంతరకరమైన భాష వాడారని ఆయనపై కేసులు నమోదైంది. దీంతో ఆయన అరెస్టు ఖాయమని వార్తలు వచ్చాయి. అంతలోపు ఆయన కోర్టును ఆశ్రయించారు.
అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం అయ్యన్నను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతలోపు ప్రభుత్వం చట్టం ప్రకారం ఆయనను అరెస్టు చేయడానికి అవసరమైన ఆధారాలు కోర్టుకు సమర్పిస్తే అపుడు కోర్టు తదుపరి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.