4000 కోట్లు ఏపీ ఖజానాలోకి వచ్చేలా జగన్ తన పోలిటికల్ కెరీర్ నే రిస్క్ లో పెట్టాడు ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. కేవలం 20 రోజుల్లోనే పంచాయితీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు , జడ్పీ ఎన్నికలు.. ఇలా మూడు రకాలు ఎన్నికలు కంప్లీట్ చేయడానికి జగన్ సర్కార్ రెడీ అయింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్, నామినేషన్, ఉపసంహరించుకోవడం, ప్రచారం, పోలింగ్ మరియు ఫలితాలు అన్నీ కూడా కేవలం 20 రోజుల్లోనే జరిగి పోయేలా పగడ్బందీ అదిరిపోయే ప్లాన్ ఏపీ ప్రభుత్వం రెడీ చేసింది. ఒకవైపు కరోనా వైరస్ మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన నిధులు విషయంలో ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా జగన్ తన పొలిటికల్ కెరియర్ ని రిస్క్ లో పెట్టి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. Image result for jagan highఈ ఎన్నికలు జరగకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాలోకి  4000 కోట్లు రావు అని…ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీసీల రిజర్వేషన్ అంశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిత్తశుద్ధితో పార్టీ తరఫున 10 పర్సంటేజ్ అమలు చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు.

 

ఎన్నికలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలను వైఎస్ జగన్ తీసుకున్నారని తెలిపారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎక్కువ ఆసక్తి చూపించడంతో….స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా వైసిపి పార్టీ అదిరిపోయే మెజార్టీ సాధిస్తుందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news