ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటివరకంటే..

ఏపీలో కరోనా కట్టడికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో కంటే ఇప్పుడు కేసులు 3 వేల లోపు నమోదవుతున్నాయి.  పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో క్రమంగా సడలింపులు ఇస్తూ… వస్తోంది ఏపీ సర్కార్‌.  అయితే.. ఏపీలో ప్రస్తుతం అమలు చేస్తున్న కర్ఫ్యూను మరో వారం రోజులు పొడగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

ఈ నెల 21 వరకు కర్ఫ్యూ పొడగిస్తున్నట్లు వెల్లడించింది. అత్యవసర సేవలు మినహా ఇతర సేవలకు అనుమతి లేదని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్ం. వ్యాపార సంస్థలు, దుకాణదారులు రాత్రి 9 గంటలకే మూసివేయాలని పేర్కొంది.

అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. షాపుల్లో మాస్కులు ధరించకుంటే ఏకంగా… రూ. 25 వేల వరకు ఫైన్‌ వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు… ఎక్కడ బహిరంగా ప్రదేశాలకు వెళ్లినా… భౌతిక దూరం మరియు మాస్క్‌లు తప్పనిసరి చేసింది సర్కార్‌.