2019 ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓటమిపాలైన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు అందరికి ఆశ్చర్యం కలిగించడం తో పాటు ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూసి జగన్ కూడా అమ్మో అన్న విధంగా చంద్రబాబు రాజకీయం ఉంది అన్నట్టు ఏపీ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి.
దేశంలోనే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తాజాగా కేవలం 29 గ్రామాలకు మాత్రమే రాజకీయ నాయకుడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలను వదిలేసి రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలకు మాత్రమే తాను రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు ప్రతిపక్ష నాయకుడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా అసెంబ్లీలో చంద్రబాబు తీరు ఉందని కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ప్రస్తుతం శాసనసభలో జరుగుతున్న తీరు చూసి సీఎం జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని వికేంద్రీకరణ విషయంలో వైయస్ జగన్ చాలా తెలివిగా వ్యవహరించారు అంటూ దాడి వీరభద్రరావు వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు మాత్రం 29 గ్రామాలకు మాత్రమే రాజకీయ నేత అన్నట్టు వ్యవహరిస్తున్నారు రోజురోజుకి చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుందని గతంలో దేశంలో 29 రాష్ట్రాలలో అత్యంత సీనియర్ రాజకీయ నేతగా వ్యవహరించిన చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉంటూ రాజధాని అమరావతి విషయంలో 29 గ్రామాలకు మాత్రమే అన్నట్టు రాజకీయాలు చేస్తున్నారని దురదృష్టకరం అని దాడి వీరభద్రరావు కామెంట్లు చేశారు. రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా గమనిస్తున్నారని చంద్రబాబు జాగ్రత్తగా వ్యవహరించాలి అంటూ సూచించారు.