జ‌గ‌న్ ను ఓడించి.. ప‌వ‌న్ ను సీఎం చేద్దాం : నాదేండ్ల‌

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత సీఎం జగ‌న్ ను ఓడించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ముఖ్య‌మంత్రిని చేద్ధామ‌ని జ‌న‌సేన నేత నాదేండ్ల మ‌నోహ‌ర్ అన్నారు. ఈ రోజు కర్నూలు లో జ‌రిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఏపీ లో జగన్ పాలన ప్రజలను అవమానించే విధంగా , మోసాగించే విధంగా ఉందని విమ‌ర్శించారు. గత ప్రభుత్వంలో ఇల్లు నిర్మించుకుంటే వికలాంగులకు లక్ష ఇచ్చేవారని అన్నారు.

కానీ జగన్ ప్రభుత్వంలో ఫించన్ తప్ప ఏమీ ఇవ్వ‌డం లేద‌ని అన్నారు. కానీ వైసీపీ ప్ర‌భుత్వం లో ఎమ్మెల్యేలు ఇసుకలో కోట్లు సంపాదిస్తున్నార‌ని విమ‌ర్శించారు. అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లలో అదనంగా 5 శాతం ఇవ్వాలన్న ఆదేశాలతో ఆ రంగాన్ని పూర్తిగా దెబ్బతీశారని ఆగ్ర‌హించారు. అలాగే రైతులకు రూ 13,500 ఇస్తానని రూ 7,500 మాత్రమే ఇస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ఓడించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ని చేసుకుందామ‌ని అన్నారు. రాష్ట్రంలో బ‌లం జ‌న‌సేన వైపే ఉంద‌ని తెలిపారు.