తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీ మారుతున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఆయన గత కొంత కాలంగా పార్టీ అధిష్టానం తీరుపై ఆగ్రహంగా ఉన్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గుడివాడ నుంచి తనను బరిలోకి దించడం మొదలు పెడితే ప్రతీ ఒక్కటి కూడా అవినాష్ లో ఆగ్రహానికి కారణాలు చాలా ఉన్నాయి. రాజకీయంగా తన కుటుంబం చాలా బలమైంది. అయినా సరే ఆయనకు సరైన ప్రొత్సాహం మాత్రం పార్టీలో లభించడం లేదనేది వాస్తవం. కొన్నాళ్ళు గా పార్టీ మారే ఆలోచనలో ఉన్న అవినాష్
మరో రెండు రోజుల్లో ఇక వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీనికి ఆరు ప్రధాన కారణాలు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. తనను గుడివాడ పంపించడం ఇష్టం లేని అవినాష్, అక్కడే పని చెయ్యాలని అధిష్టానం సూచించడం, రెండో కారణం విషయానికి వస్తే… పెనమలూరు సీటు ఇస్తామని చెప్పి ఇప్పుడు అధిష్టానం వెనకడుగు వేస్తుందనే అసహనం అవినాష్ లో ఎక్కువగా ఉంది. మూడో కారణం చూస్తే తనను గన్నవరం నుంచి పోటీ చేయమని అధిష్టానం పదే పదే చెప్పడం, దీనిపై లోకేష్ ఒత్తిడి చేయడం అవినాష్ ఇబ్బంది పడుతున్నారట.
నాలుగో కారణం చూస్తే ఎన్నికల్లో పార్టీ నిధులు ఇస్తామని చెప్పి కూడా అధిష్టానం ఇవ్వలేదని, తోట త్రిమూర్తులు వంటి వారికి ఇచ్చిందని ఆయన ఆగ్రహంగా ఉన్నారట. ఐదో కారణం ఒకసారి చూస్తే… తన విషయంలో స్థానిక నాయకత్వం పదే పదే ఫిర్యాదులు చేసి కట్టడి చెయ్యాలని భావిస్తుందని అవినాష్ కి అనుమానాలు ఉన్నాయట. ఆరో కారణం చూస్తే… తన బాబాయి నుంచి ఇతరులకు మద్దతు ఉండటం, పెనమలూరులో తనను పని చేయకుండా అడ్డు పడుతుంది ఆయనే అని భావిస్తున్నారట. అలాగే చంద్రబాబు నుంచి సరైన సహకారం లేదనే భావనలో ఉన్న అవినాష్ పార్టీ మారితేనే మంచిది అని భావిస్తున్నారట. మరో రెండు రోజుల్లో పార్టీ మారే అవకాశం ఉందని అంటున్నారు.