మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకుండానే భేటీ కావడంతో దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. అదే టైంలో ప్రభుత్వం ఏర్పాటుపై శివసేన ప్రయత్నాలు ఫలింంచలేదు. కాంగ్రెస్ ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేదు. ఇక గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయగానే ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుండడంతో మహా రాజకీయం గవర్నర్ పాలన దిశగా సాగుతోందన్నది స్పష్టంగా తెలుస్తోంది.
మరో వైపు ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి ఇచ్చిన గడువు సాయంత్రం ఏడుగంటలకు ముగియనుండగా ఈలోగానే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం పట్ల విపక్షాలు భగ్గుమన్నాయి. కేంద్ర హోంశాఖకు గవర్నర్ లేఖ చేరడంతో కేంద్ర క్యాబినెట్ గవర్నర్ సిఫార్సుపై మంగళవారం రాత్రే ఓ నిర్ణయం తీసుకోనుంది. దీనిని బట్టి గవర్నర్ కేంద్రం డైరెక్షన్‌లో నడుస్తున్నారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక కేంద్ర కేబినెట్ డెసిషన్ ఎలా ఉంటుందా ? అన్న ఉత్కంఠ నెలకొంది.
ఈ పరిణామాలను బట్టి మహారాష్ట్రలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలు లేకుండానే కేంద్రమే చక్రం తిప్పి గవర్నర్ పాలన దిశగా ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎన్సీపీ గడువు ముగియకుండానే ఎలా రాష్ట్రపతి పాలన విధిస్తారని పలువురు రాజకీయ మేథావులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో చర్చల బాధ్యతను సీనియర్ నేతలకు అప్పగించిన సోనియా అప్పగించారు.