“ధారావి” సమరం మొదలైంది .. మహారాష్ట్ర కి పెను సవాల్ !

-

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. దీంతో ఇప్పటి వరకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితి బట్టి పొడిగించాలని ఆలోచిస్తుంది. దేశం లో వైరస్ యొక్క ప్రభావం ఉన్న కొద్ది బయట పడుతున్న తరుణంలో దేశంలో చాలా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నీ కొనసాగించాలని కోరుతున్నారు. అత్యంత తక్కువ భాగం ఎక్కువ జనాభా కలిగిన దేశం కావటంతో ఏమాత్రం వైరస్ విరుచుకుపడిన, దేశం మూడో స్టేజ్ కి వెళ్ళినా కంట్రోల్ చేసే వైద్య సదుపాయం దేశంలో లేదని చాలామంది అంటున్నారు.RERA Mumbai-Government mandates to register SRA projects by 31st ... కరోనా వైరస్ ప్రభావం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో ఎక్కువగా ఉంది. దాదాపు 1000 దగ్గర వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో ఇటీవల 110 కేసులు 24 గంటల్లో నమోదు కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి పెను సవాలుగా కరోనా వైరస్ మారింది. ముఖ్యంగా ముంబై నగరం ” ధారావి ” అనే స్లామ్ ప్రాంతంలో ఈ వైరస్ బాగా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు విషయం లో మర్కజ్ మస్జిద్ కేంద్ర మరియు రాష్ట్ర అధికారులను ఉలిక్కి పడేటట్లు చేసింది. ఇలాంటి తరుణంలో అత్యంత మురికి ప్రాంతం కలిగిన ధారవి ప్రాంతం నుండి ఢిల్లీ మత ప్రార్థనలకు చాలామంది వెళ్లారట. తాజాగా ఈ విషయం బయటపడింది. 

 

ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికి వాడ ” ధారావి “. ఇటువంటి ప్రాంతంలో కరోనా వైరస్ విజృంభిస్తే  దాదాపు దేశంలో చాలా వరకూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవలే మర్కజ్ మసీదు కి వెళ్ళిన ఇద్దరు కరోనా బాధితులు ఈ ప్రాంతంలో చనిపోయినట్లు తాజాగా అధికారులు గుర్తించారు. వాళ్ళిద్దరే కాకుండా ఇంకా చాలామంది మత ప్రార్థనలకు వెళ్లడంతో వీళ్ళందరూ ఎవరెవరిని కలిశారు గుర్తించడానికి మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. దీంతో ఈ ప్రాంతాన్ని మొత్తం అంతా మహారాష్ట్ర ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మహారాష్ట్రకు ” ధారావి ” ప్రాంతం పెనుసవాలుగా మారింది. 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news