MLC కవితపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

-

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​పై బీఆర్ఎఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  గవర్నర్ పై ఎమ్మెల్సీ కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్​ఎస్ సభకు లేని కరోనా నిబంధనలు గణతంత్ర దినోత్సవాలకి వచ్చాయా అని ప్రశ్నించారు.

రాజకీయాల్లో ఓనమాలు తెలియని బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ  గవర్నర్​పై నోటికి వచ్చిన కూతలు కూయడం ఆ పార్టీ నాయకుల అహంకారానికి నిదర్శనమని అరుణ మండిపడ్డారు. గణతంత్ర వేడుకలు జరపని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని ధ్వజమెత్తారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించేలా లేదని, దేశంలో తెలంగాణ అంతర్భాగం కానట్లు రాష్ట్ర సర్కార్ వ్యవహరిస్తుందని  మండిపడ్డారు. మహిళ అనే గౌరవం లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడిన ఎమ్మెల్సీ కవితను వెంటనే బర్తరఫ్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news