ట్రంప్ కీ బాలయ్య కీ పోలిక తో కొత్త న్యూస్ వైరల్ అవుతోంది ..

-

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవరికి వారు పాపులర్ అయిపోతున్నారు. కొన్ని కొన్ని విషయాలకు పోలికలు పెడుతూ వాటికి సంబంధించిన వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటిస్తున్న ఈ సమయంలో డోనాల్డ్ ట్రంప్ కి మరియు బాలయ్య కి కొత్త పోలికతో ఒక న్యూస్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. Image result for donald trump balakrishna

విషయంలోకి వెళితే ఇటీవల ఫిబ్రవరి 24వ తారీఖున భారత్ లో అడుగు పెట్టిన డోనాల్డ్ ట్రంప్ మొదటిరోజు తాజమహల్ మరియు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ రెండు సందర్భాల్లో అక్కడున్న రిజిస్టర్ లో ట్రంప్ సంతకం చేశారు. ఇప్పుడా సంతకం వైరల్ అయింది. నరమానవుడికి కూడా అర్థంకాని రీతిలో ట్రంప్ సంతకం ఉంది. ఓ వైపు ఈ సంతకం వైరల్ అవుతుండగానే మరోవైపు బాలయ్య సంతకాన్ని తెరపైకి తీసుకొచ్చారు కొంత మంది నెటిజన్లు.

 

డోనాల్డ్ ట్రంప్ సిగ్నేచర్ కి ఏ మాత్రం తీసిపోదు మా బాలయ్య సిగ్నేచర్ అంటూ ఇద్దరి సంతకాలను జోడి చేసి స్క్రీన్ షాట్స్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరి సంతకాలు చూస్తే ఏ మాత్రం వీటిని ఫోర్జరీ చేయడం ఎవరితరం కాదు. 

Read more RELATED
Recommended to you

Latest news