థాంక్యూ కరోనా :  ఎవ్వరూ రాజకీయాలు చెయ్యడం లేదు .. ఉబ్బితబ్బిపోతున్న జనం..!!

-

కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. భారతదేశంలో 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగ‌తి అందరికీ తెలిసినదే. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కచ్చితంగా అమలు చేస్తున్నారు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు చెందిన వాళ్లు. వైరస్ ఎక్కడా కూడా విస్తరించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరోపక్క ముఖ్యమంత్రులు ప్రభుత్వ అధికారులు. ఇటువంటి తరుణంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది మత్స్యకారులు చాపల వేట కోసం తమిళనాడు కు వెళ్లి చిక్కుకుపోయినట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.ஆந்திரா மீனவர்களுக்கு உதவிடுக ...దాదాపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 30 మంది మత్స్యకారులు తమిళనాడు తీర ప్రాంతానికి వెళ్ళినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వల్ల సముద్రంలో చెన్నై హార్బర్ దగ్గర చిక్కుకుపోయారు అంటూ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబాలు ఎంతో బాధ పడుతున్నారని భోజనం మరియు వసతి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పోస్ట్ పెట్టారు. కాబట్టి వెంటనే తమిళనాడు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు తమిళనాడు సీఎం పళని స్వామి స్పందించారు.

 

వెంటనే తమిళనాడు మత్స్య శాఖకు ఆదేశాలు జారీ చేసి ఆంధ్రా కు చెందిన 30 మంది మత్స్యకారుల బాగోగులను చూసుకుంటామని ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ కి తమిళనాడు సీఎం హామీ ఇచ్చారు. దీంతో ప్రభుత్వాలు ఒకపక్క కరోనా వైరస్ గురించి పోరాడుతున్న టైంలో రాజకీయ నాయకులు ఎవరికి వారు బాధ్యతాయుతంగా రాజకీయాలు చేయకుండా బాధ్యతాయుతంగా నడవడంతో జనం ఉబ్బితబ్బిపోతున్నరు. థాంక్యూ కరోనా మా రాజకీయ నాయకులు ని కలుపుతునందుకు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news