ఉప ముఖ్యమంత్రికి 11 శాఖలు ఇచ్చిన ముఖ్యమంత్రి…!

నాటకీయ పరిణామాల మధ్య ఏర్పడిన హర్యానా ప్రభుత్వంలో తొలి మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఈ మంత్రి వర్గ విస్తరణలో కొన్ని సంచలనాలు కూడా నమోదు చేశారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాలాకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ 11 శాఖలు కేటాయించడం సంచలనంగా మారింది. గురువారం ఎమ్మెల్యేలు అనిల్ విజ్, కన్వర్ పాల్, సందీప్ సింగ్, మాల్ చంద్ శర్మ, రంజిత్ సింగ్, జై ప్రకాష్ దలాల్, అనూప్ కుమార్ ని మంత్రి మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. కొత్తగా పది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా…

వారిలో బిజెపి నుంచి 8 మంది దుశ్యంత్ నేతృత్వంలోని జేజేపీ నుంచి ఇద్దరు మంత్రులుగా ప్రమాణ శ్వీకారం చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. దీనితో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తో కలిపి మంత్రుల సంఖ్య 12 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే మంత్రి వర్గ విస్తరణకు ముందు… దుశ్యంత్ కి 11 శాఖలు కేటాయించారు. ఎక్సైజ్, సుంకాలు, అభివృద్ధి, పంచాయతీలు, పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారం, పౌరసరఫరాలు, ప్రజా పన్నులు, విపత్తు నిర్వహణ, కార్మిక ఉపాధి కల్పన శాఖ,

దుశ్యంత్ కి కేటాయించారు ముఖ్యమంత్రి… ఇక ఆయనకు కేటాయించకుండా మిగిలి ఉన్న శాఖలను ఖట్టర్ నిర్వహిస్తారు. హర్యానాలో సీఎం, డిప్యూటీ సీఎం ని మినహాయిస్తే 14 మందికి అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటె ఎన్నికల ఫలితాల అనంతరం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో బిజెపి, దుశ్యంత్ నేతృత్వంలోని జేజేపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకి ఎక్కువ అవకాశాలు బిజెపికి ఉండటంతో స్వతంత్ర అభ్యర్థులు కూడా ఆ పార్టీకే మద్దతు పలికారు. మాజీ ప్రధాని దేవీ లాల్ మనవడే దుశ్యంత్ చౌతాలా…!