‘సరిలేరు నీకెవ్వరు’ అందులో స్లో అయినా, ఇందులో మాత్రం ఫాస్ట్ గా దూసుకెళ్తోంది…!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఒకప్పటి నటి విజయశాంతి, ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్, రఘు బాబు, రావు రమేష్, శ్రీనివాస రెడ్డి, బండ్ల గణేష్, హరితేజ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలు పెంచినప్పటికీ, సినిమా నుండి ఒక్క సాంగ్ కూడా రిలీజ్ కాబోతుండడం మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో కొంత నిరాశను కలిగిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే సరిగ్గా ఈ సినిమాతో పాటు అదే రోజున రిలీజ్ అవుతున్న బన్నీ, త్రివిక్రమ్ ల ‘అల వైకుంఠపురములో’ కూడా రిలీజ్ అవుతుతూ, ప్రమోషన్స్ పరంగా ఎంతో దూకుడుగా ముందుకు సాగుతోంది. అయితే సరిలేరు ఆ విషయమై కొంత వెనకపడినప్పటికీ, ప్రీ రిలీజ్ బిజినెస్ లో మాత్రం దుమ్మురేపుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించి మన రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు ఎంతో భారీ రేటుకు అమ్ముడవుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఓవర్సీస్, మరియు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా హక్కులు అమ్ముడుపోగా మిగతా ప్రాంతాల హక్కులకై బయ్యర్ల మధ్య ఎంతో పోటీ నెలకొని ఉందని అంటున్నారు. అయితే ప్రమోషన్స్ విషయమై కొంత వెనుకబడ్డ ఈ సినిమాకు సంబంధించి టీజర్ మరియు ఫస్ట్ సాంగ్ ని అతి త్వరలో యూట్యూబ్ లో రిలీజ్ చేయదానికి సిద్ధం అవుతోందట సినిమా యూనిట్. మరి దీనిని బట్టి మొత్తానికి సరిలేరు నీకెవ్వరు అటు ప్రమోషన్స్ లోను, ఇటు ప్రీ రిలీజ్ బిజినెస్ లోను దూసుకెళ్తున్నట్లు అర్ధం అవుతోంది. మరి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోయే ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి….!!