సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఈట‌ల జ‌మున‌.. తాను కూడా పోటీ చేస్తుందంట‌..!

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక అనే ఎపిసోడ్ న‌డుస్తోంది. ఇక్క‌డ జ‌రిగే ప్ర‌తి ప‌రిణామం కూడా ఏదో ఒక పార్టీలో మార్పుకు కార‌ణ‌మ‌వుతోంది. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు ప్ర‌తి పార్టీని ఎంత‌గానో టెన్ష‌న్ పెడుతోంది. అయితే అస‌లు ఈ ఉప ఎన్నిక‌కు కార‌న‌మైన ఈటల రాజేందర్ మీద మొద‌టి నుంచి ఓ అనుమానం తెగ చెక్క‌ర్లు కొడుతోంది.ఇక్క‌డ ఈట‌ల రాజేంద‌ర్‌కు బ‌దులు ఆయ‌న స‌తీమ‌ణి ఈట‌ల జ‌మున‌ etela jamuna పోటీ చేస్తుంద‌నే వార్త‌లు మొద‌టి నుంచి చాలా బ‌లంగా వ‌స్తున్నాయి. కాగా దీనిపై ఇప్ప‌టి దాకా అటు ఈట‌ల గానీ లేదా ఆమె స‌తీమ‌ణి గానీ లేదా బీజేపీ గానీ పెద్ద‌గా స్పందించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే ఇప్ప‌డు దీనిపై జ‌మున చేసిన సంచ‌ల‌న వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.

పోటీ చేసే ఆలోచ‌న త‌న‌కు కూడా ఉంద‌ని, కాక‌పోతే ఈట‌ల రాజేందర్ చేసినా తాను చేసినా అది పెద్ద తేడా ఏమీ కాద‌ని, ఎవ‌రం పోటీ చేసినా బీజేపీ నుంచే అంటూ పెద్ద ట్విస్టు ఇచ్చి తాను కూడా పోటీ చేస్తామంటూ చెబుతున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అనుమానాల‌కు పెద్ద బ‌లం చేకూరిన‌ట్టు ఉంది. మ‌రి నిజంగానే ఆమె పోటీ చేస్తుందా లేకె రాజేంద‌రే పోటీ చేస్తాడా అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.