ఈట‌ల రాజేందర్ వ‌ర్సెస్ హ‌రీశ్‌రావు.. త‌గ్గ‌ని ట్ర‌బుల్ షూట‌ర్‌

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఈట‌ల రాజేందర్ (Etela Rajender) వ్య‌వ‌హారంపై అనేక ర‌కాలుగా మ‌లుపులు తిరిగి చివ‌ర‌కు ఓకొలిక్కి వ‌చ్చింది. ఆయ‌న‌పై వ‌స్తున్న అనేక వార్త‌ల‌కు ఆయ‌న మొన్న చెక్ పెట్టేశారు. త‌న పార్టీ ప‌ద‌వికి, ఎమ్మెల్యే ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేస్తున్న‌ట్టు మొన్న ప్ర‌క‌టించేశారు. కానీ అదే సంద‌ర్భంగా ఆయ‌న కేసీఆర్ గురించి, క‌విత గురించి, హ‌రీశ్‌రావు గురించి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు.

 

ముఖ్యంగా హ‌రీశ్‌రావు గురించి చెబుతూ.. త‌న నియోజ‌క‌వ‌ర్గంపై హ‌రీశ్‌రావును పెట్టార‌ని, వాస్త‌వానికి టీఆర్ఎస్‌లో అనేక అవ‌మానాలు ఎదుర్కొన్న‌ది హ‌రీశ్‌రావేన‌ని ఈట‌ల రాజేందర్ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. మొద‌టి నుంచి హ‌రీశ్‌రావుకు అన్యాయం జ‌రిగిందన్నారు.

దీంతో మొద‌టిసారి హ‌రీశ్‌రావు ఈట‌ల వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. అయితే ఆయ‌న డైరెక్టుగా మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడ‌కుండా ప్రెస్‌నోట్ విడుద‌ల చేశారు. ఈట‌ల మాట‌లు అర్థం లేనివ‌న్నారు. త‌న భుజాల‌పై తుపాకీ ఎక్కుపెడితే బాగుండ‌ద‌న్నారు. త‌న ప్రాణం ఉన్నంత వ‌ర‌కు టీఆర్ఎస్‌లోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. దీంతోఇప్పుడు వీరిద్ద‌రి మ‌ధ్య వైరం మొద‌ల‌యింది. ఇప్పుడు హ‌రీశ్‌రావు మ‌రోసారి హుజూరాబాద్‌నేత‌ల‌తో మంత‌నాలు జ‌ర‌ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.