ఈట‌ల రాజీనామా.. ఆ కీల‌క ప‌ద‌వికి బాధ్య‌త‌లు కేటీఆర్ కు..?

-

ఈట‌ల రాజేంద‌ర్‌కు కేసీఆర్ త‌ర్వాత అత్య‌ధిక సంఘాలతో ప‌రిచ‌యాలు ఉన్నాయి. ఆయ‌న మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎన్నో సంఘాలు, సొసైటీల‌కు అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నాడు. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి, టీఆర్ ఎస్‌కు రాజీనామా చేయ‌డంతో ఆయ‌న అధ్యక్షుడిగా కొన‌సాగుతున్న అన్ని ప‌ద‌వుకుల‌కు కూడా రాజీనామా చేశారు. దీంతో అవ‌న్నీఇప్పుడు ఖాళీ అయ్యాయి.

ఈట‌ల/ KTR

ఇక అలాంటి కీల‌క ప‌ద‌వుల్లో ఒక‌టైనది నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడి ప‌ద‌వి. దీనికి ఈట‌ల రాజేంద‌ర్ అధ్య‌క్షుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ప‌ద‌వి చెప్పేందుకు చిన్నదిగా అనిపించినా.. బాగానే పవర్ ఉన్న పదవిగా గుర్తింపు ఉంది దీనికి. ఈ పదవి కూడా అంత ఈజీగా రాద‌నే చెబుతుంటారు. దానికి అధ్య‌క్షుడిగా కావాలంటే కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది.

అలాంటి కీల‌క పదవికి ఈటల రాజేంద‌ర్ ఇప్పుడు రాజీనామా చేయంతో ఖాలీ అయింది. దీంతో ఈ ప‌ద‌వికి భారీగా పోటీ నెల‌కొంది. ఇలాంటి టైమ్‌లో దీన్ని వివాదంలోకి లాగ‌కుండా ఉంచాలంటే కేటీఆర్ అధ్య‌క్షుడిగా ఉండాలనే డిమాండ్ తెర‌మీద‌కు వ‌చ్చింది. దీంతో త్వ‌ర‌లోనే ఆయ‌న దీనికి అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని తెలుస్తోంది. ఈ సొసైటీకి భారీ ఎత్తున నిధులు ఉంటాయ‌ని, ఎన్నో ర‌కాల అధికారాలు ఉంటాయ‌ని తెలుస్తోది.

Read more RELATED
Recommended to you

Latest news