ఎన్నికల వాయిదా గ్యాప్ లో .. ఏపీ కి కేంద్ర ఎన్నికల సంఘం పెద్దలు ?? జగన్ కి బ్యాడ్ న్యూస్ ?

-

ఆంధ్ర రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. ప్రపంచ దేశాలను గజగజ లాడిస్తున్న ఈ వైరస్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో పైగా ఒకరి నుండి ఒకరికి సోకే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ చెప్పుకొచ్చారు. Image result for election commissionఎన్నికల ప్రక్రియ వాయిదా పడినప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇటువంటి నేపథ్యంలో ఎన్నికల వాయిదా గ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల మాచర్లలో మరికొన్ని చోట్ల జరిగిన దాడుల విషయంలో జరిగిన హింసాత్మక ఘటనలు కేంద్ర ఎన్నికల పెద్దల దృష్టికి వెళ్లడంతో..ఈ గ్యాప్ లో కేంద్ర ఎన్నికల సంఘం పెద్దలు రాష్ట్రంలో పర్యటించడానికి రెడీ అయినట్లు సమాచారం.

 

దీంతో ఇది కచ్చితంగా జగన్ కి బ్యాడ్ న్యూస్ అవుతుందని…దాడుల వీడియోలు బట్టి జగన్ సర్కార్ కి మ్యాగ్జిమం కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇవ్వడం గ్యారెంటీ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందు మూలంగానే ఇటీవల హడావిడిగా గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం తప్పిస్తున్నట్లు వెల్లడించిందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news