ఎర్రబెల్లికి ఎన్‌ఆర్‌ఐతో టఫ్ ఫైట్..పాలకుర్తిలో మళ్ళీ గట్టెక్కుతారా?

-

ఎర్రబెల్లి దయాకర్ రావు..తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు..అలాగే ప్రజా మద్ధతు ఎక్కువ నేత. పోటీ చేసిన తొలి ఎన్నికలో ఓడిన..తర్వాత ఓటమి ఎరగని నేతగా ముందుకెళుతున్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా ఎర్రబెల్లి రాజకీయాల్లోకి వచ్చారు. 1983లో పోటీ చేసి తొలిసారి ఓటమి పాలయ్యారు. తర్వాత డి‌సి‌సి‌బి అధ్యక్షుడుగా, రేషన్ డీలర్స్ గౌరవ అధ్యక్షుడుగా పనిచేశారు. ఇక 1994 లో తొలి విజయం అందుకున్నారు..తర్వాత 1999, 2004లో కూడా గెలిచారు. 2008 ఉపఎన్నికల్లో వరంగల్ ఎంపీగా గెలిచారు. ఇక 2009, 2014 ఎన్నికల్లో వరుసగా టి‌డి‌పి నుంచి గెలికారు.

కానీ తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు..2018లో గెలిచారు..మంత్రి అయ్యారు. ఇక మంత్రిగా ఎర్రబెల్లి దూసుకెళుతున్నారు. తన నియోజకవర్గం పాలకుర్తిలో తిరుగులేని పొజిషన్ లో ఉన్నారు. ఇక నెక్స్ట్ కూడా ఈయనదే గెలుపు అనుకునే తరుణంలో కాంగ్రెస్ నుంచి ఎన్‌ఆర్‌ఐ హనుమండ్ల ఝాన్సీ రంగంలోకి దిగారు. ఆమె అనూహ్యంగా పాలకుర్తి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ లో దూకుడుగా పనిచేస్తున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు..ప్రజా మద్ధతు పెంచుకుంటున్నారు.

నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి బరిలో దిగడానికి ఆమె రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఆర్ధికంగా ఝాన్సీ బలంగా ఉండటంతో ఎర్రబెల్లి కాస్త ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పైగా రాజకీయంగా ఆమెని ఎర్రబెల్లి ఏమి అనలేని పరిస్తితి ఎందుకంటే..ఎర్రబెల్లి..అమెరికా వెళ్ళిన ప్రతిసారి ఝాన్సీ ఫ్యామిలీ అతిధ్యం ఇచ్చేదట. దీంతో ఎర్రబెల్లికి రాజకీయంగా ఇబ్బందిగా మారిపోయింది. ఈ సారి పాలకుర్తిలో టఫ్ ఫైట్ ఎదురవుతుందనే డౌట్.

అయితే ఎంత కాదు అనుకున్న పాలకుర్తి ఎర్రబెల్లి కంచుకోట. అక్కడ ఆయనకు పెద్ద నెగిటివ్ లేదు. ఇప్పుడు ఝాన్సీ రూపంలో గట్టి పోటీ వచ్చింది గాని..గెలుపు విషయంలో డౌట్ లేదని తెలుస్తుంది. చూడాలి మరి ఎర్రబెల్లికి ఝాన్సీ ఏ మేరకు పోటీ ఇస్తుందో.

Read more RELATED
Recommended to you

Latest news