ఏపీ బీజేపీలో ఊహించని మార్పు జరిగింది. అసలు తెలంగాణ బిజేపి నాయకత్వం మార్పుపై వార్తలు, కథనాలు వస్తున్నాయి గాని..ఏపీలో మార్పుల గురించి చర్చ లేదు. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో బండి సంజయ్‌ని అధ్యక్షుడుగా తప్పిచి కిషన్ రెడ్డిని నియమిస్తారనే చర్చ సాగింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు బండిని తప్పించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా పెట్టారు. అటు అనుకున్నట్లుగానే ఈటల రాజేందర్‌కు ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చారు.
అయితే ఏపీలో సడన్ మార్పు జరిగిపోయింది. సోము వీర్రాజుని సైడ్ చేయి దగ్గుబాటి పురంధేశ్వరిని అధ్యక్షురాలుగా నియమించారు. దీంతో సీన్ పూర్తిగా మారింది. అసలు సోము నాయకత్వంలో ఏపీ బిజేపి పెద్దగా పికప్ అవ్వలేదు..ఇంకా అదే నోటా ఓట్ల కంటే వెనుకబడే ఉంది. పైగా ఆయన అధికారంలో ఉన్న వైసీపీని కాకుండా టిడిపిని విమర్శిస్తూ వచ్చారు. దీంతో సోము జగన్ మనిషి అనే ముద్ర పడింది.
ఇక ఎఫెక్టివ్ గా పనిచేయని సోముని సడన్ గా అధ్యక్షుడు పదవి నుంచి తొలగిస్తున్నట్లు బిజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా..నేరుగా ఆయనకే ఫోన్ చేసి చెప్పారు. వెంటనే పురంధేశ్వరిని ఏపీ బిజేపి అధ్యక్షురాలుగా నియమించారు. దీంతో రాజకీయం మారింది. ఇక పురంధేశ్వరి బిజేపిని ఏ విధంగా బలోపేతం చేస్తారో చూడాలి. అలాగే జగన్ ప్రభుత్వంపై ఆమె దూకుడుగా ఉంటారో లేదో చూడాలి. ఇప్పటికే ఆమె జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు.
అయితే టిడిపి-జనసేనతో బిజేపి పొత్తు అనేది ఎప్పటినుంచో జరుగుతున్న చర్చ..కానీ బిజేపి…టిడిపితో పొత్తు పెట్టుకోమని అంటుంది. ఇప్పుడు పురంధేశ్వరిని అధ్యక్ష హోదాలో పెట్టడం ద్వారా…పొత్తుకు రెడీ అని సిగ్నల్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏపీ బిజేపిలో ఏం జరుగుతుందో.