ఓటుకు 10 వేలు అట..కేసీఆర్ బరితెగించాడు : ఈటల ఫైర్

సిఎం కెసిఆర్ పై మరోసారి ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను వాస్తవంగా ఎమ్మెల్యేకు రాజీనామా చేయలేదని.. వాళ్లే నన్ను రాజీనామా చేయమని అడిగితే చేసానని పేర్కొన్నారు. హుజూరాబాద్ లో ఓటు 10 వేలు ఇస్తున్నారని.. దళిత బంధు పై సిఎం కెసిఆర్ బరి తెగించి మాట్లాడుతున్నదంటూ నిప్పులు చెరిగారు.

తాను పార్టీని విడిచిపెట్టలేదని…వదిలిపెట్టేలా చేసారని ఆరోపించారు. 18 ఏళ్లపాటు ఉద్యమాన్ని నడిపి జైళ్లో ఉన్న వ్యక్తిని తాను.. మంత్రి నయ్యాక కూడా కేసుల కోసం గంటల కొద్దీ కోర్టుల దగ్గర గడిపానన్నారు. అయిన వాన్ని ఆకుల్లో, కాని వాళ్లను కంచాల్లో కేసీఆర్ పెట్టాడని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పులిబిడ్డల్లా కొట్లాడిన వాళ్లంతా బజార్లో పడ్డారని.. మా రక్తాన్ని కళ్ల చూసిన వారు, అవమానించిన వారు ఇప్పుడు కేసీఆర్ పక్కన ఉన్నారని దిరే అయ్యారు.

దళితులపై ప్రేమతో కాదట.. వారి ఓట్లకోసమే పది లక్షలు ఇస్తానంటున్నాడు. ఓట్ల కోసమే దళితులకు పది లక్షలు ఇస్తానని నిన్న కేసీఆర్ బరితెగించి చెబుతున్నాడని మండిపడ్డారు. తనను ప్రశ్నించేవాడు తెలంగాణ గడ్డమీద ఉండకూడదని కేసీఆర్ భావిస్తున్నారని.. బానిసలుగా బతికేవాళ్లు కావాలట… తాను బానిసను కాదు అని చురకలు అంటించారు.