సెల్ఫీతో క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి రోజా.. ప్రచారాలకు బ్రేక్ పడినట్టేనా..

-

ప్రత్యర్దులపై మాటల తూటాలు పేల్చే మాజీ మంత్రి రోజా.. ఎన్నికల తర్వాత కొద్దిరోజులు రాజకీయాలకు దూరమయ్యారు.. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం మీడియాలో ఉండే ఆమె.. ఓటమి తర్వాత కనుమరుగు అవ్వడంతో ఆమె ప్రత్యర్దులు పనిగట్టుకుని విష ప్రచారం చేశారు.. వైసీపీకి ఆమె గుడ్ బై చెబుతున్నారని కామెంట్స్ చేశారు.. తెలుగు రాజకీయాలకు స్వస్తి చెప్పి.. తమిళనాట ఆమె అడుగు పెట్టబోతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది.. వాటన్నింటికి రోజా ఒక్క సెల్పీతో చెక్ పెట్టింది..

మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం అధినేత జగన్ ను పొగడ్తల్లో ముంచెత్తడమో, లేక ఆయనతో కలిసి సెల్ఫీలు దిగుతూనో కనిపించిన రోజా.. గత కొంతకాలంగా మాత్రం తాడేపల్లి ప్యాలెస్ వైపే రావడం మానేశారు. తాడేపల్లిలో జగన్ నిర్వహిస్తున్న పార్టీ నేతల సమీక్షల్లో సైతం కనిపించకుండా ఆమె దూరంగా ఉండిపోయారు.. దీంతో ఆమెను టార్గెట్ చేస్తూ.. అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.. ఈ సమయంలో రోజా సడన్ గా వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రత్యక్షమయ్యారు.. జగన్ తో సెల్పీ తీసుకుని ఎక్స లో పోస్ట్ చేశారు.. ఆ ఒక్క సెల్పీ ఎన్నో నోర్లను మూయించిందని.. తన భవిష్యత్ రాజకీయంపై క్లారిటీ ఇచ్చిందని ఆమె అనుచరులు చెబుతున్నారు..

పెద్దిరెడ్డితో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను కూడా పార్టీ క్యాడర్ కొట్టిపారేస్తోంది.. అందరూ కలిసిమెలసి పార్టీ బలోపేతానికి కృషి చెయ్యబోతున్నారని.. ఆరకంగా జగన్ సెట్ చేశారని నగర వైసీపీలో టాక్ నడుస్తోంది.. వైసీపీలో ఉన్న మహిళా నేతల్లో ఎమ్మెల్సీ కళ్యాణి మినహా.. మిగిలినవారెవ్వరూ పెద్దగా మీడియా ముందుకు రావడంలేదు.. మరో ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీకి గుడ్ బై చెప్పడంతో రోజా సేవలను విసృతంగా వినియోగించుకోవాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట.. ఇదే విషయం సమీక్షా సమావేశంలొ కూడా జగన్ చెప్పారని..రోజా సన్నిహితులు చెబుతున్నారు.. మొత్తంగా రోజా మళ్లీ యాక్టివ్ కాబోతున్నారన్న మాట..

Read more RELATED
Recommended to you

Latest news