జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్..టీడీపీలోకి కీలక నేతలు

-

వైసీపీ సిద్ధాంతాలు, ఆ పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి విధ్వంసక విధానాలు నచ్చక పలువురు ఆ పార్టీని వీడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్ తగిలింది. జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నర్సింహారావు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.

Jaggayapet Municipal Chairman Rangapuram Raghavendra joins TDP

వారితో పాటు 7వ వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు, కుమారుడు కృష్ణ, 23వ వార్డు కౌన్సిలర్ డి.రమాదేవి దంపతులు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ పడనివిధంగా భారీ వర్షాలు కురిశాయి. ప్రభుత్వ అప్రమత్తంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలిచింది. వరదలోనూ జగన్ రెడ్డి బురద రాజకీయాలు చేశారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news