తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు ప్రధాన పట్టాణాలు అన్ని నీట మునుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే వరంగల్, కరీనంగర్, సిరిసిల్ల, నిజమాబాద్ లాంటి కీలక పట్టణాల్లోని కాలనీలు మొత్తం వరదల్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే వారంతా కూడా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కరీంనగర్ టౌన్ కూడా నీళ్లలో మునిగిపోవడంతో మంత్రి గంగుల కమలాకర్ కొన్ని కాలనీల్లో తిరిగి చర్యలు చేపట్టేందుకు ఆర్డర్లు వేశారు.
అయితే ఆయన ఈ వరదలపై చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చీనీయాంశంగా మారియి. ఇంకా చెప్పాలంటే పబ్లిక్ ఫైర్ అయ్యే విధంగా ఉంటున్నాయి. అయితే ఆయన మాత్రం తెలంగాణ రాష్ట్రంలో వరదలు రావడానికి కేసీఆర్ పరిపాలనే కారణమని అన్నారు. ఆయన సీఎం అయిన తర్వాత భూగర్భ జలాలు అన్నీ నిండుగా ఉన్నాయని, కాబట్టి చినుకు పడ్డా అది వరదలకు దారి తీస్తోందని చెబుతున్నారు. తెలంగాణలో ఇందువల్లనే వరదలు వస్తున్నాయన్నారు.
ఇక కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు, కుంటలు, చెరువులు నిండు కుండల్లా నిండిపోయాయని, అందుకే వాగులు, వంకలు పారుతున్నాయన్నారు. ఇక ఇలా చెరువులు, కుంటలు నిండిపోవడం వల్ల వరదనీరు అందులోకి వెళ్లకుండా ఇలా కాలనీల్లోకి వస్తున్నాయని చెప్పారు. అయితే ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. కరీంనగర్, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో టీఆర్ ఎస్ నేతలు చెరువులు, నాలాలు, కుంటలను కబ్జా చేయడం వల్లనే ఇండ్లలోకి నీరు వస్తుందని, అది చెప్పకుండా ఇలా క్రెడిట్ కొట్టేసేందుకు చూస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.