గంటా సొంత ఇమేజ్ కోసం కష్టపడుతున్నారా…?

-

విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నుంచి కాస్త దూకుడుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి గంటా శ్రీనివాసరావు గట్టిగా పోరాటం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకు సహకరించే విషయంలో కాస్త దూకుడు గానే ఉంది. అయితే ఇప్పుడు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు కాస్త ఇబ్బంది పడుతున్నారని టిడిపి వర్గాలు అంటున్నాయి.

గంటా శ్రీనివాసరావు ఏకపక్షంగా వెళ్లడంతో ఉత్తరాంధ్ర లో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్నారు అంటూ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం గంటా శ్రీనివాసరావు ప్రయత్నం చేస్తున్నారని వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని అందుకే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కాస్త గట్టిగా కష్టపడుతున్నారని అంటున్నారు.

అందుకే ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు అని మీడియా వర్గాలు అంటున్నాయి. టిడిపిలో కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. గంటా శ్రీనివాసరావు ఇటీవల తెలుగుదేశం పార్టీ కోసం పెద్దగా పని చేసిన కార్యక్రమాలు అంటూ ఏమీ లేవు. మున్సిపల్ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు తో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో సొంతగా రాజకీయం చేయడంతో టిడిపి నేతలు ఇబ్బందులు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news