దేశ వ్యాప్తంగా క్రిమినల్ ఆరోపణలు మరియు అవినీతి కేసులను ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులపై త్వరగా విచారణ జరిపేందుకు ఏ ఉత్తర్వులను అయినా స్వాగతిస్తామని కేంద్రం బుధవారం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. శాసన సభ్యులపై పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణకు సుప్రీం కోర్టు కాలపరిమితిని నిర్ణయించవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సిట్టింగ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై సుమారు 4 వేల 442 కేసులు దేశంలోని వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం ఇటీవల సుప్రీం కోర్టుకు తెలియజేసింది.
దేశ వ్యాప్తంగా ఎంపీలు / ఎమ్మెల్యేల కేసులను వేగంగా విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడంలో ఏకరూపత లేదని కేంద్రం తరపున అమికస్ క్యూరీ సుప్రీం కోర్టుకు తెలియజేశారు. కేసులను త్వరగా పరిష్కరించడానికి రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని హైకోర్టు లను ఆదేశించవద్దని అమికస్ క్యూరీ సూచించారు.