అమ్మ ఒడి గుడ్ న్యూస్…!

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ్మ ఒడి పథకం విషయంలో జగన్ సర్కార్ దూకుడుగా వెళ్తుంది. చదువుకునే పిల్లలకు ఆర్ధిక సాయం చేస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. తాజాగా జగన్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. పాఠశాలల్లో నాడు –నేడు, అమ్మ ఒడి, మధ్యాహ్న భోజనంలో నాణ్యతపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్,

తొలి ఏడాది 75శాతం హాజరు నిబంధన పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మినహాయి౦చినట్టు పేర్కొన్నారు. స్కూల్ కి వెళ్ళని పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రవేశపెడుతున్నందున తొలిఏడాది స్ఫూర్తి నింపేలా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా 75శాతం హాజరు నిబంధన పాటించాలని స్పష్టం చేసారు. ఇదే విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు చెప్పాలని అధికారులకు జగన్ సూచించారు.

61,344 పిల్లలకు సంబంధించి చిరునామాలు సరిగ్గా లభ్యం కావడంలేదని.. అందుకు కొంత సమయం కావాలని అధికారులు సీఎం వైఎస్‌ జగన్ కు తెలపగా, స్పందించిన జగన్ వీలైనంత త్వరగా వెరిఫికేషన్‌ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 7,231 అనాథ పిల్లలకు సంబంధించి అమ్మ ఒడి డబ్బును సగం అనాథశ్రమానికి, సగం పిల్లల పేరుమీద డిపాజిట్‌ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

1,81,603 మంది పిల్లలకు సంబంధించిన కుటుంబాల్లో 300 పైబడి యూనిట్ల కరెంటు ఉందని, ఇందులో ఉమ్మడి కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నారంటూ క్షేత్రస్థాయి నుంచి వినతులు వస్తున్నాయని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకురాగా జగన్ మాట్లాడుతూ, దీనిపై మరోసారి రీ వెరిఫికేషన్‌ చేయించి అర్హులైన వారికి తప్పనిసరిగా అమ్మ ఒడి వర్తింపు చేయాలని జగన్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news