రాజ్ భవన్ లోకి గవర్నర్ రాజకీయాలను జొప్పిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. గవర్నర్ వ్యవస్థ గురించి కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని ఆయన అన్నారు. ప్రభుత్వం పంపిన ఫైళ్లను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఆపేశారని ఆయన ఆరోపించారు. గవర్నర్ మొదటి నుంచి ఫైళ్లను ఆలస్యం చేశారని అన్నారు. ఎవరి ఆజ్ఞల మేరకు ఇలా చేస్తున్నారో అంటూ తెలియదని అన్నారు. వ్యవస్థల మధ్య ఉండాల్సిన సహకారం గురించి కేసీఆర్ గారికి తెలుసు అని ఆయన అన్నారు. రోజుల తరబడి ఆపి పెట్టడం…. ఫైళ్లను వెనక్కి పంపడం వంటి చేస్తున్నారని ఆయన అన్నారు. ఉద్దేశపూర్వకంగానే గవర్నర్ ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. బీజేపీ రాజకీయం చేయడానికి గవర్నర్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని అన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎందుకు ఆమోదించకపోవడానికి హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. వ్యవస్థల మధ్య పంచాయతీ రావడం మంచిది కానది సీఎం కేసీఆర్ ఆలోచించారని.. అందుచే వేరే పేరును ప్రతిపాదించామని ఆయన అన్నారు.
రాజ్ భవన్ లోకి గవర్నర్ రాజకీయాలను జొప్పిస్తున్నారు….. మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-